కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలంలోని జుక్కల్ గురుకుల పాఠశాల ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేస్తూన్నస్టాఫ్ నర్స్ సునీత ను ప్రిన్సిపాల్ లైంగిక వేధింపులకు గురిచేయడం చాలా భాదకర మైనా విషయం.ఆయన పెట్టే బాధలు తట్టుకోలేక సునీత పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు మాత్రమే కాదు ప్రభుత్వం తక్షణమే ప్రిన్సిపాల్ ను తన విధుల నుండి సస్పెండ్ చెయ్యాలి మరియు గురుకుల పాఠశాలలో పనిచేస్తున్న నర్సస్ అందరికి తగిన రక్షణ కల్పిస్తూ, అందుకు కావలసిన జాగ్రత్తలు వెంటనే ప్రభుత్వం తీసుకోవాలి అని నర్సింగ్ ఆఫీసర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి లక్ష్మణ్ రూడవత్ పేర్కొన్నారు. రాష్ట్రంలో ఈ రోజు చాలా గురుకులలో నర్సింగ్ స్టాఫ్ పనిచేస్తున్నారు.
వారి విషయంలో ప్రభుత్వ తగు జాగ్రత్తలు తీసుకోవాలి.మరియు రాబోయే రోజుల్లో ఇలాంటివి జరగకుండా చూడాలి..లేనియెడల రాష్ట్రంలో పనిచేస్తున్న నర్సస్ అందరూ తమ విధులను బహిష్కరించి నిరసనలు రాష్ట్ర వ్యాప్తంగా చేపటుతాము అని నర్సస్ అందరూ ముక్తకంఠంతో నినదిస్తున్నారు అని రాష్ట్ర NOA అధ్యక్షుడు శ్రీను రాథోడ్ అన్నారు. ఇటువంటి సంఘటనలు ఎన్నో జరుగుతునప్పటికి భయంతో భాదితులు చెపుకోకపోవడం వలన వెలుగులోనికి రావడం లేదని సునీత దైర్యంగా చెప్పడం వలన ఈ సంఘటన వెలుగులోనికి వచ్చింది కావున సంభందిత అధికారులు వెంటనే స్పందించి విచారణ జరిపి నిర్భయ చట్టం కింద అరెస్టు చేయాలని చిలుపూరి వీరాచారి ముఖ్య సలహాదారులు నర్సింగ్ ఆఫీసర్స్ అసోసియేషన్ కోరారు.