మూడు రాజధానుల ప్రకటన వచ్చినప్పటినుండి తెలుగు తమ్ముళ్ళు అస్సలు నిద్రపోవడం లేదు ఎందుకంటే రాష్ట్రానికి ఎదో జరుగుతాది అని కాదు కేవలం ఆ పార్టీ నాయకుల బండారాలు బయటపడకూడదనే వారి తాప్రతయం అంతా. మొత్తం వారికి అనుకూలంగా మార్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. కాని ప్రజలు కూడా వారి మాటలను నమ్మకపోవడంతో ఏమీ చెయ్యని పరిస్థితిలో ఉన్నారు. చివరికి ఎలాగు మన మాటలు చెల్లవు అనుకోని పిచ్చి కూతలు కూస్తున్నారు. దీనిపై స్పందించిన విజయసాయి రెడ్డి “మూడు రాజధానుల ప్రకటన వచ్చినప్పటి నుంచి టీడీపీ నాయకుల ఉక్రోషం కట్టలు తెంచుకుంటోంది. సీఎం హోదాను సైతం అవమానించే రీతిలో మాట్లాడుతున్నారు. ఇన్‌సైడర్ ట్రేడింగ్ బండారం బయట పడేటప్పటికి ఎలాగూ జైలుకు పోయేదేకదా అని పిచ్చి కూతలు కూస్తున్నారు. మీ రాజకీయ జీవితాలకు తెరపడే రోజులు వచ్చాయి” అని అన్నారు.
