హైదరాబాద్ బేగంపేట్ లోని పాత ఎయిర్ పోర్ట్లో మంత్రి హెలికాఫ్టర్ సేవలు ప్రారంబించారు. ఈ టూరిజం ప్యాకేజీలో భాగంగా బేగంపేట ఎయిర్ పోర్టు నుంచి మేడారం, మేడారం నుంచి హైదరాబాద్ బేగం పేట ఎయిర్ పోర్టు వరకు సేవలు నిర్వహిస్తున్నామన్నారు. హైదరాబాద్ నుండి 6 గురు ప్రయాణికులకు 1లక్ష 80 వేలు తో పాటు జీఎస్టీ ఉంటుందన్నారు. దీంతో పాటు మేడారం జాతర వ్యూ హెలిక్యాప్టర్ వ్యూలో చూసేందుకు ప్రతి ప్రయాణికుడి వద్ద రూ. 2999 నామ మాత్రపు చార్జీ వసూలు చేస్తున్నారు.
మేడారం సమ్మక్క – సారలమ్మల మహా జాతరకు వచ్చిన భక్తులకు మరియు పర్యాటకులకు హెలిక్యాప్టర్ లో విహరించే అద్బుత అవకాశంను కూడా తెలంగాణ పర్యాటక శాఖ కల్పించిందన్నారు మంత్రి. పర్యాటకులు హెలిక్యాప్టర్ సదుపాయంను ఉపయేగించుకోవటానికి ఫోన్ నెంబర్ 94003 99999ని సంప్రదించాలని మంత్రి తెలిపారు