ఏపీ శాసనమండలిలో వికేంద్రీకరణ బిల్లును టీడీపీ అధినేత చంద్రబాబు కుట్రపూరితంగా అడ్డుకుని సెలెక్ట్ కమిటీకి పంపించడంతో ఆగ్రహించిన జగన్ సర్కార్ ఏకంగా శాసనమండలినే రద్దు చేశాడు. కాగా మూడు రాజధానుల ఏర్పాటుపై ప్రభుత్వం ముందడుగు వేస్తున్న తరుణంలో టీడీపీ అధినేత చంద్రబాబు పదే పదే విశాఖ, కర్నూలుపై విష ప్రచారం చేయిస్తున్నారు. విశాఖలో రాజధాని పెట్టమని మిమ్మల్ని ఎవడు అడిగాడు…విశాఖ రాజధానిగా పనికిరాదు..తుఫాన్లు, వరదలు వస్తాయి..విశాఖలో రాజధానికి భూములు కూడా లేవు అంటూ విశాఖపై తన అనుకుల మీడియాతో దుష్ప్రచారం చేయిస్తున్నారు. విశాఖలో కడప నుంచి, రాయలసీమ నుంచి లుంగీలు కట్టుకుని రౌడీలు, కబ్జాదారులు దిగిపోయి అరాచకం చేస్తారంటూ నోరుపారేసుకుంటున్నాడు. రాయలసీమకు విశాఖ దూరమని…అంతదూరం ఎలా వెళతారని అడ్డగోలుగా వాదిస్తున్నాడు.
తాజాగా చంద్రబాబు మరోసారి విశాఖపై విషం కక్కారు. అసలు బుద్ధి ఉన్న వాడెవడైనా రాజధానికి అమరావతి వదిలేసి విశాఖపట్నం వెళతాడా అంటూ వ్యాఖ్యానించారు. తమ గ్రామం నుంచి వచ్చే వారు అమరావతి వదిలి విశాఖపట్నం వెళ్లరని స్పష్టం చేశారు. ఇక రాయలసీమ, చిత్తూరు జిల్లాలోని తన సొంతూరు నారావారిపల్లెలో వైసీపీ వికేంద్రీకరణ సభను పెట్టడంపై కూడా చంద్రబాబు అక్కసు వెళ్లగక్కాడు. మూడు రాజధానుల గురించి తన గ్రామం వెళ్లి సభ పెట్టాల్సిన అవసరం మంత్రులకు ఏం వచ్చిందని చంద్రబాబు ప్రశ్నంచాడు. రాష్ట్రంలో వైసీపీ పెట్టే సభలకు వెళ్లద్దంటూ చంద్రబాబు అర్థంపర్థం లేని మాటలు మాట్లాడాడు. అయితే మీ అమరావతి సభలకు వెళ్లవద్దని సీఎం జగన్ ఎక్కడైనా ప్రజలకు చెప్పారా..నువ్వు జోలెపట్టుకుని అడుక్కుంటే డబ్బులు ఇవ్వద్దు అని చెప్పారా..ఎందుకు చంద్రబాబు అధికారం కోల్పోయినా..నీకు ఎందుకంత అహంకారం..ఎందుకంత కుసంస్కారం అని వైసీపీ నేతలు మండిపడుతున్నారు. అయినా నీ సొంతూరులో నీకు తప్పా..ఎవరికి సభ పెట్టే హక్కులేదా.. అదేమైనా నీ రాజ్యమా…నీవేమైనా చక్రవర్తివా…ఏం మాట్లాడుతున్నావు చంద్రబాబు అంటూ వైసీపీ నేతలు ఫైర్ అయ్యారు.. కావాలంటే..నువ్వు కూడా సీఎం జగన్ సొంతూరు పులివెందులకు వెళ్లి అమరావతిలోనే రాజధాని ఉండాలంటూ సభ పెట్టుకో..కానీ నీకంత దమ్ములేదు…అమరావతి పాట పాడుతూ సీమలో అడుగుపెట్టడానికే వణికిపోతున్నావు..అంటూ వైసీపీ నేతలు సెటైర్లు వేస్తున్నారు. మొత్తంగా తన సొంతూరిలో సభ పెట్టాల్సిన అవసరం ఏంటని చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు హాస్యాస్పదంగా మారాయి.