అమరావతిలో గత ఐదేళ్ల టీడీపీ హయాంలో చంద్రబాబుతో సహా టీడీపీ మాజీమంత్రులు, ఎమ్మెల్యేలు, ఒక సామాజికవర్గానికి చెందిన బడా పారిశ్రామికవేత్తలు పెద్ద ఎత్తున ఇన్‌సైడర్ ట్రేడింగ్‌కు పాల్పడ్డారని… బినామీల పేరుతో 4075 ఎకరాలు కొట్టేసి, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి వేల కోట్లు గడించారని వైసీపీ సర్కార్ ఆరోపించింది. ఈ మేరకు అమరావతి ఇన్‌సైడర్ ట్రేడింగ్‌పై సీఐడీ విచారణకు ఆదేశించింది. విచారణలో భాగంగా తెల్ల రేషన్ కార్డులున్న 790 మందికి పైగా పేదలు… రాజధాని పరిధిలో కోట్ల రూపాయల విలువ చేసే భూములను కొనుగోలు చేసిన వైనాన్ని సీఐడీ వెలికి తీసింది. దీంతో ఈ వ్యవహారంలో మనీ ల్యాండరింగ్ జరిగి ఉంటుందని తెల్ల రేషన్ కార్డుదారుల పేర్లు చూపించి టీడీపీ నేతలే ఆ భూములను కొనేసి ఉంటారన్న భావనతో.. ఈ కేసులో ఇన్వాల్వ్ కావాలని మనీ ల్యాండరింగ్ వ్యవహారాన్ని తేల్చాలని ఈడీకి సీఐడీ లేఖ రాసింది. దీంతో రంగంలోకి దిగిన ఈడీ అధికారులు టీడీపీ నేతలు భూదందాలపై, తెల్లకార్డుదారుల బాగోతంపై ప్రాథమిక ఆధారాలు సేకరించిన సీఐడీ దర్యాప్తును ముమ్మరం చేశారు.
తాజాగా అమరావతి ఇన్‌సైడర్ ట్రేడింగ్ వ్యవహారంలో మాజీ మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, నారాయణలపై ఈడీ కేసు నమోదు చేసింది. ఇక త్వరలోనే అమరావతిలో ఇన్‌సైడర్ ట్రేడింగ్‌కు పాల్పడి…మనీలాండరింగ్ ద్వారా పెద్ద ఎత్తున విదేశాలకు నల్లడబ్బును తరలించిన టీడీపీ నేతల గుట్టును కూడా ఈడీ త్వరలో బయటపెట్టనుంది. కాగా అమరావతి ఇన్‌సైడర్ ట్రేడింగ్‌పై దమ్ముంటే సీబీఐ విచారణ జరిపించండి అంటూ సవాలు విసిరిన చంద్రబాబు, లోకేష్, టీడీపీ నేతలకు తాజాగా మాజీమంత్రులు పత్తిపాటి పుల్లారావు, నారాయణలపై ఈడీ కేసు నమోదు చేయడంతో టెన్షన్ పట్టుకుంది. ఈడీ దర్యాప్తులో ఎక్కడ తమ గుట్టు బయటపడుతుందో అంటూ చంద్రబాబుతో సహా, టీడీపీ నేతలెవ్వరు ఈడీ కేసులపై నోరు మెదపడంలేదు. మరి ఈడీ దర్యాప్తులో ఎవరెవరి గుట్టు బయటపడుతుందో చూడాలి.