మేడారం వెళ్లాలనుకునే భక్తుల కోసం ఆర్టీసీ ఏర్పాట్లు చేస్తోంది. దీనిలో భాగంగా.. అక్కడికి వెళ్లాలనుకునేవారి కోసం బస్సు ఛార్జీల వివరాలను ప్రకటించింది.ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన పండుగ అది.. దట్టమైన అడవుల్లో, కొండ కోనల మధ్య జరిగే జాతర అది.. దాదాపు 900 ఏళ్ల చరిత్ర కలిగిన ఉత్సవం అది.. మొత్తంగా చెప్పాలంటే ‘తెలంగాణ కుంభమేళా’ అది.. గిరిజన సంప్రదాయాన్ని కళ్లకు కట్టే ఆ పండుగే.. ‘‘సమ్మక్క-సారలమ్మ జాతర’’. మేడారంలో జరిగే ఈ మహా జాతరకు సర్వం సిద్ధమవుతోంది. తాజాగా.. మేడారం వెళ్లాలనుకునే భక్తుల కోసం ఆర్టీసీ ఏర్పాట్లు చేస్తోంది. దీనిలో భాగంగా.. అక్కడికి వెళ్లాలనుకునేవారి కోసం బస్సు ఛార్జీల వివరాలను ప్రకటించింది. మొత్తం 23 లక్షల మందిని తరలించేలా లక్ష్యం పెట్టుకున్న ఆర్టీసీ.. ఇప్పుడున్న ఛార్జీలకు 50% అదనంగా ఛార్జీలు వసూలు చేయబోతోంది.
ఓ సారి బస్సు ఛార్జీల వివరాలను పరిశీలిస్తే..!
హైదరాబాద్ నుంచి రూ.440
ఖాజీపేట్ నుంచి రూ.190
హన్మకొండ నుంచి రూ.190
వరంగల్ నుంచి రూ.190
పరకాల నుంచి రూ.190
చిట్యాల నుంచి రూ.200
ఘణపురం(ము) నుంచి రూ.140
భూపాలపల్లి నుంచి రూ.180
కాటారం నుంచి రూ.210
కాళేశ్వరం నుంచి రూ.260
సిరోంచ నుంచి రూ.300
ఏటూర్ నాగారం నుంచి రూ.60
కొత్తగూడ నుంచి రూ.240
నర్సంపేట్ నుంచి రూ.190
మహబూబాబాద్ నుంచి రూ.270
తొర్రూర్ నుంచి రూ.280
వర్ధన్నపేట్ నుంచి రూ.230
స్టేషన్ ఘన్‌పూర్ నుంచి రూ.240
జనగామ నుంచి రూ.280 వసూలు చేస్తారు.