తెలుగులో చిన్న చిన్న పాత్రలను చేస్తూ ‘బిగ్ బాస్ 3’ రియాలిటీ షోతో ఒక్కసరిగా పెద్ద పాప్యులర్ అయిన అందాల భామ పునర్నవి భూపాలం. ఇప్పుడు ఎక్కడ చూసిన ఆమె పేరు తెలియాని వారే లేరు . అంతలా తెలుగు ప్రజలకు సుపరిచితురాలు. అయితే తాజాగా పునర్నవి ఒక సినిమాలో ప్రదాన పాత్ర పోషిస్తుంది. ‘ఒక చిన్న విరామం’. సస్పెన్స్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ సినిమా, ఈ నెల 14వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. పునర్నవి .. సంజయ్ వర్మ .. నవీన్ .. గరిమా సింగ్ ప్రధానమైన పాత్రలను పోషించారు. ఈ సినిమాను గురించి దర్శకుడు సందీప్ చేగూరి మాట్లాడుతూ .. “ఒక కొత్త కాన్సెప్ట్ తో ఈ సినిమాను రూపొందించాము. అడుగడుగునా ఈ సినిమా అనూహ్యమైన మలుపులు తిరుగుతూ ఉత్కంఠను రేకెత్తిస్తుంది. కొత్తదనాన్ని కోరుకునే ప్రేక్షకులకు ఈ కథ తప్పకుండా నెక్ట్ అవుతుంది. పునర్నవి కెరియర్ కి ఈ సినిమా మరింత హెల్ప్ అవుతుందనే నమ్మకం వుంది” అంటూ ఆశాభావాన్ని వ్యక్తం చేశాడు. ఇక సినిమా హిట్ అయితే పునర్నవి లవర్స్ డే రోజు తెలుగు ప్రేక్షకులకు ఏం చేప్పబోతుందో అని ప్రచారం జరుగుతుంది.
