హైదరాబాద్ నగర వాసులకు శుభవార్త. నగర వాసులకు జేబీఎస్ నుంచి ఎంజీబీఎస్ వరకు 11 కిలోమీటర్ల మేర మెట్రో ప్రయాణం అందుబాటులోకి రాబోతోంది. ఇప్పటికే ట్రయల్ రన్ పూర్తి చేసుకున్న కారిడార్-2ని.. సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభించనున్నారు. ఫిబ్రవరి 7న సాయంత్రం 4 గంటలకు జేబీఎస్-ఎంజీబీఎస్ మెట్రో లైన్‌ను సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభించనున్నట్టు మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. ఈ రెండు స్టేషన్ల మధ్య 9 స్టేషన్లు నిర్మించారు. ఈ మార్గం అందుబాటులోకి వస్తే.. జేబీఎస్ నుంచి ఎంజీబీఎస్ వెళ్లడానికి కేవలం 16 నిమిషాల సమయం మాత్రమే పట్టనుంది.
Hon’ble CM Sri KCR Garu will inaugurate the JBS-MGBS Metro ? line on 7th Feb at 4pm
This will take the total length of Hyderabad Metro Rail to 69 KM @ltmhyd @hmrgov
— KTR (@KTRTRS) February 4, 2020