జాతీయ కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆస్పత్రిలో చేరారు. అనారోగ్యం కారణంతో ఢిల్లీలోని గంగారామ్ ఆస్పత్రిలో చేరగా ప్రస్తుతం ఆమెకు వైద్యులు చిక్సిత అందిస్తున్నారు. సోనియా ఆరోగ్య పరిస్థితిపై ఆస్పత్రి వర్గాల నుంచి అధికారిక ప్రకటన వెలువడలేదు. పార్టీ వర్గాలు మాత్రం సాధారణ చెకప్ కు వెళ్లినట్టు చెబుతున్నారు. కొంతకాలంగా సోనియా ఉదర కోశ సంబంధిత సమస్యతో బాధ పడుతున్నారు. దీనికి గతంలో చికిత్స తీసుకున్న విషయం తెలిసిందే. ఈ విషయం తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ నేతలు ఆస్పత్రికి చేరుకుంటున్నారు. కొద్దిరోజులుగా సోనియా ఆరోగ్యం నిలకడగా లేదని, చిన్న ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని పార్టీ నేతలే చెప్పుకుంటున్నారు. ఇలాంటి సమయంలో సోనియా ఆసుపత్రిలో చేరడం పార్టీ నేతలకు ఆందోళన కలిగిస్తోంది. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సిఉంది.
