టీమిండియా, న్యూజిలాండ్ మధ్యన జరిగిన టీ20 సిరీస్ లో భాగంగా భారత్ అద్భుతమైన ఆటతో అన్ని మ్యాచ్ లలో గెలిచి సిరీస్ తమ సొంతం చేసుకోవడమే కాకుండా క్లీన్ స్వీప్ కూడా చేసింది. దాంతో ఆ దేశంలో క్లీన్ స్వీప్ చేసిన మొదటి జట్టుగా చరిత్ర నిలిచింది. అయితే ఈ సిరీస్ గెలవడంలో వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ కీలక పాత్ర పోషించాడని చెప్పడంలో సందేహమే లేదు. ఎందుకంటే సిరీస్ విన్నింగ్ మ్యాచ్ లో సూపర్ ఓవర్ లో అద్భుతమైన ఆటతో జట్టుని గెలిపించాడు. అయితే ఇక అసలు విషయానికి వస్తే ఆనందంలో ఉన్న భారత్ అభిమానులకు ఇది షాకింగ్ న్యూస్ అని చెప్పాలి. బీసీసీఐ నుండి వచ్చిన సమాచారం ప్రకారం చూసుకుంటే ఓపెనర్ రోహిత్ శర్మ న్యూజిలాండ్ తో ఆడబోయే వన్డే, టెస్ట్ సిరీస్ కు దూరం అవుతున్నాడని తెలుస్తుంది.
