మరోసారి టీడీపీ అధికారంలోకి వస్తే తాము ప్రతీకారానికే ప్రాధాన్యత ఇస్తామని మాజీమంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. గుంటూరుజిల్లా తెలుగుదేశం పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో మాట్లాడిన పుల్లారావు అభివృద్ధి చేస్తే ఓట్లు పడలేదు కాబట్టి రివెంజ్ కు ప్రాధాన్యత ఇద్దామన్నారు. తనపై తప్పుడు కేసులు పెట్టినవారిపై అంతకు రెట్టింపుగా 10 కేసులు పెడదామని, అవసరమైతే చంద్రబాబు దగ్గర కూడా గట్టిగా మాట్లాడతానని ప్రత్తిపాటి హామీ ఇచ్చారు. వైసీపీ ప్రభుత్వం తమపై నాలుగు కేసులు నమోదు చేస్తే, తాము వచ్చాక 1 కేసులు పెడతామని, వైసీపీకి కొమ్ము కాస్తున్న అధికారులను కూడా వదిలిపెట్టే ప్రసక్తేలేదన్నారు. ఇటీవల అధికారం కోల్పోయాక ప్రత్తిపాటిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుతో పాటు పత్తి కొనుగోళ్ల స్కామ్ తోపాటుగా పలుకేసులు నమోదయ్యాయి