మెగాస్టార్ చిరంజీవి రాజకీయాలకు దూరమయిన తరువాత తీసిన మొదటి సినిమా ఖైదీ నెంబర్ 150. అనంతరం సైరా నరసింహారెడ్డి చిత్రంతో బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డ్స్ బ్రేక్ చేసాడు. ఇప్పుడు అదే ఊపును కొనసాగించడానికి కొరటాల తో సినిమా తీస్తున్నాడు. కొరటాల శివ సినిమా అంటే ఎలాంటి స్టోరీస్ ఉంటాయో అందరికి తెలిసిన విషయమే. తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరో విషయం బయటకు వచ్చింది. అదేమిటంటే ఈ సినిమాకు విలన్ గా మోహన్ బాబు నటించిబోతున్నారని తెలిసింది. ఇప్పటికే దీనికి సంబంధించి స్క్రీన్ టెస్ట్ కూడా అయినట్టు తెలుస్తుంది. దాంతో వీరిద్దరి కాంబినేషన్ కోసం వెయ్యి కళ్ళతో వేచిచూస్తున్నారు.
