బాహుబలి సిరీస్ తర్వాత టాలీవుడ్ జక్కన్న ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వహిస్తోన్న లేటెస్ట్ మూవీ ఆర్ఆర్ఆర్. టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ఇద్దరు సూపర్ స్టార్లతో పాటుగా బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరో కూడా ఇందులో నటిస్తున్నాడు.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ తో పాటుగా యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఇందులో హీరోలుగా నటిస్తుండగా అక్షయ్ కుమార్ విలన్ పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం.
ఈ మూవీకోసం సూపర్ స్టార్ మహేష్ బాబు సాయం చేయనున్నాడు. గతంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన మూవీ జల్సాకు వాయిస్ ఓవర్ ఇచ్చిన మాదిరిగా ఆర్ఆర్ఆర్ తెలుగు వెర్షన్ కు మహేష్ బాబు వాయిస్ ఓవర్ ఇవ్వనున్నట్లు ఫిల్మ్ నగర్లో వార్తలు విన్పిస్తున్నాయి.
ఈ మూవీపై అంచనాలను ఇంకా పెంచడానికి జక్కన్న ఇలా ప్లాన్ చేశారని కూడా ఫిల్మ్ నగర్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. మరోవైపు హిందీ వెర్షన్ లో బిగ్ బి అమితాబ్ వాయిస్ ఓవర్ విన్పిస్తున్నట్లు సమాచారం.