చంద్రబాబు అధికారంలో ఉన్న సమయంలో తనదైన శైలిలో ప్రజలను తన మాటలతో మభ్యపెట్టారు తప్ప జనాలకు చేసింది ఏమిలేదని చెప్పాలి. మరోపక్క అప్పట్లో హుదూద్ తుఫాన్ వచ్చిన సమయంలో వైజాగ్ వాసులు ఎన్ని కష్టాలు పడ్డారో అందరికి తెలిసిన విషయమే. ఈ సమయంలో అందరు తలో చెయ్యి వేసి వారికి సహాయం చేయడం జరిగింది. అప్పుడే చంద్రబాబు గారు వారికి చేసింది ఏమి లేదుగాని మాటలు మాత్రం చెప్పారు. తుఫానులను ఒంటిచేత్తో ఆపేస్తానని చెప్పుకొచ్చారు. దీనిపై ట్విట్టర్ వేదికగా స్పందించిన విజయసాయి రెడ్డి “తుఫాన్లను నియంత్రించగల అతీంద్రియ శక్తులు కలిగిన చంద్రబాబు నాయుడి వైపు ప్రపంచమంతా చూస్తోంది. కరోనా వైరస్ నుంచి రక్షించేందుకు ఆయన ఏదో ఒకటి చేయకపోతే భూమి మీద మనుషులు మిగలరని ప్రపంచ ఆరోగ్య సంస్థ సహా అంతా ఆందోళన చెందుతున్నారు”! అని అన్నారు.
