చైనాతో పాటు పలు అగ్రదేశాలను వణికిస్తున్న కరోనా వైరస్ ప్రస్తుతం భారతీయులను కూడా వణికిస్తుంది. ఎందుకంటే కేరళలోని ఈ వైరస్ కు సంబంధించి జనవరి 30న మొదటి కేసు నమోదయింది. ఇక్కడ ఒక విద్యార్ధికి పరీక్షలు నిర్వహించగా కరోనా సోకినట్లు తెలిసింది. అంతేకాకుండా ఆ విద్యార్ధి మరణించాడు కూడా. ఈ యువకుడు వుహాన్ లో చదువుకుంటున్నాడు. అక్కడ వైరస్ ఎక్కువ అవ్వడంతో తిరిగి ఇంటికి వచ్చేసాడు. ఇక తాజాగా యూనియన్ హెల్త్ మినిస్ట్రీ సమాచారం ప్రకారం ఆదివారం కేరళలోనే రెండో కేసు కూడా నమోదు అయినట్టు తెలిసింది. దీంతో అందరు అప్రమత్తం అయ్యారు.
