ఇండియా, న్యూజిలాండ్ మధ్య జరిగిన ఐదు టీ20 మ్యాచ్ లలో భాగంగా చివరి మ్యాచ్ లో భారత్ కు స్లో ఓవర్ కారణంగా వారి మ్యాచ్ లో 20% ఫీజు కోత విధించారు. అంతకుముందు జరిగిన నాలుగో టీ20 కూడా ఇదే రకంగా స్లో ఓవర్ వెయ్యడంతో 40% కోత విధించిన విషయం తెలిసిందే. వరుసగా రెండు మ్యాచ్ లలో ఇలా జరగడంతో కొంత నిరాశకు గురయ్యింది టీమ్ మేనేజ్మెంట్. మొత్తానికి కివీస్ గడ్డపై విజయం సాధించి సిరీస్ క్లీన్ స్వీప్ చేసిన మొదటి జట్టుగా నిలిచింది.