గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాలతో పాటు గ్రామ వాలంటీర్, వార్డు వాలంటీర్ పోస్టుల్ని ఏపీ సర్కారు నియమించిన సంగతి తెలిసిందే. . ఆంద్రప్రదేశ్ లో విప్లవాత్మకంగా అమలవుతున్న గ్రామ, వార్డు సచివాలయాల పనితీరుపై ప్రజల నుండి హర్షాతిరేకాలు వెల్లువెత్తుతున్నాయి.ఏళ్ల తరబడి పరిష్కారం కాని సమస్యలకూ రోజుల వ్యవధిలో మోక్షంఅసాధ్యాన్ని సుసాధ్యం చేసిన సీఎం వైఎస్ జగన్ కి ప్రజానీకం కృతజ్ఞతలు తెలుపుతున్నారు. తాజాగా నేడు‘ఇంటివద్దకే పెన్షన్’ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాల్లో ఘనంగా ప్రారంభమైంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వృద్ధాప్య, వికలాంగ, వితంతువులకు గ్రామ, వార్ఢు వలంటీర్లు వారి ఇంటి వద్దనే పెన్షన్‌లు అందజేస్తున్నారు. ఇందులో బాగాంగ వెంకటగిరి మున్సిపాల్టీ పరిధిలోని 21 వ వార్డు ఒంటెల వీధిలో వైఎస్ఆర్ పెన్షన్ కానుకను నేరుగా లబ్ధిదారులకు అందించారు వైసీపీ ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి. ఇంటి వద్దకే పింఛన్ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించిన ఆయన.. వాలంటీర్లతో కలసి ఇంటింటికీ వెళ్లి పింఛన్లు అందించారు.
