బడ్జెట్ అనే పదం BOUGETTE అనే పదం నుండి పుట్టింది. BOUGETTE అంటే తోలు సంచి అని అర్ధం. భారత రాజ్యాంగంలో ఎక్కడా కూడా బడ్జెట్ అనే పదం లేదు.
కానీ నూట పన్నెండో ఆర్టికల్ ప్రకారం వార్షిక ఆర్థిక నివేదికగా పేర్కొనబడింది.సాధారణంగా ఆర్థిక శాఖ మంత్రి ప్రవేశపెట్టే బడ్జెట్లో ఒక సంవత్సరకాలంలో రాబోయే ఆదాయం,చేయబోయే వ్యయం గురించిన లెక్కలు మాత్రమే ఉంటాయి.