కేంద్ర బడ్జెట్ ను పార్లమెంట్ లో ప్రవేశపెట్టే సంప్రదాయాన్ని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ మార్చివేశారు. ప్రతిసారి బడ్జెట్ ను ప్రవేశపెట్టే సమయంలో బడ్జెట్ ప్రతిని మాములుగా సూట్ కేసులో తీసుకువచ్చే సంప్రదాయం గత కొన్నేళ్ళుగా కొనసాగుతూ వస్తుంది. కానీ ఈసారి మాత్రం ఆమె గతంలో మాదిరిగా కాకుండా బడ్జెట్ ప్రతిని సూట్ కేసులో కాకుండా ఎరుపు రంగు బస్తాలో పార్లమెంట్ కు తీసుకువచ్చారు. భారతీయులు ఎక్కువగా సూట్ కేసుల కంటే బస్తాల(సంచుల)నే వాడతారని విషయాన్ని ప్రపంచానికి తెల్సేలా చేసేందుకు ఆమె ఇలా చేస్తున్నారని పార్లమెంట్ వర్గాలు అంటున్నాయి.
