తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్శితురాలై టీఆర్ఎస్ పార్టీలో తూంకుంట మున్సిపాలిటీకి చెందిన ఆరో వార్డు కౌన్సిలర్ గుంతల లక్ష్మీ క్రిష్ణారెడ్డి చేరారు.
ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో గుంతల లక్ష్మీ క్రిష్ణారెడ్డి కౌన్సిలర్ గా స్వతంత్ర అభ్యర్థిగా గెలుపొందారు. అయితే తెలంగాణ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి నివాసంలో ఆమె టీఆర్ఎస్ లో చేరారు.
ఈ సందర్భంగా మంత్రి మల్లారెడ్డి పార్టీ కండువా కప్పి సాధారంగా ఆహ్వనించారు. తూంకుంట మున్సిపాలిటీ అభివృద్ధికి అందరూ కృషి చేయాలని మంత్రి మల్లారెడ్డి పిలుపునిచ్చారు.