గత ఐదేళ్ల టీడీపీ హయాంలో చంద్రబాబు, ఆయన సామాజికవర్గానికి చెందిన మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, పారిశ్రామికవేత్తలు అమరావతిలో పెద్ద ఎత్తున ఇన్‌సైడర్ ట్రేడింగ్‌కు పాల్పడ్డారని బినామీల పేరుతో 4 వేల ఎకరాలకు పైగా భూములు కొనుగోలు చేసి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి కోట్లాది రూపాయలు కొల్లగొట్టారని వైసీపీ ప్రభుత్వం ఆరోపిస్తుంది. ఈ మేరకు రాజధాని భూముల విషయంలో జరిగిన ఇన్‌సైడర్ ట్రేడింగ్‌పై విచారణ జరిపాస్తామని సీఎం జగన్ స్వయంగా ప్రకటించారు. ఇక అసెంబ్లీలో మంత్రి బుగ్గన స్వయంగా ఇన్‌సైడర్ ట్రేడింగ్‌కు పాల్పడిన టీడీపీ నేతల వివరాలను అంకెలతో సహా వివరించారు. ఇన్‌సైడర్ ట్రేడింగ్‌కు పాల్పడ్డారని ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిలో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్, మాజీమంత్రులు పరిటాల సునీత,పత్తిపాటి పుల్లారావు, నారాయణ, లోకేష్ బినామీ వేమూరి రవిప్రసాద్, టీడీపీ మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ నరేంద్ర చౌదరి, కొమ్మాలపాటి శ్రీధర్, ప్రస్తుత టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్, టీడీపీ మాజీ అధికార ప్రతినిధి లంక దిన్‌కర్, లింగమనేని రమేష్, పుట్టా సుధాకర్ యాదవ్, నందమూరి బాలయ్య తదితరులు ఉన్నారు. కాగా అమరావతిలో జరిగిన ఇన్‌సైడర్ ట్రేడింగ్‌పై ప్రభుత్వం సీఐడీ విచారణకు ఆదేశించగా…కొందరు టీడీపీ నేతలు 797 మంది తెల్లరేషన్ కార్డుదారుల పేర్లతో ఏకంగా 761 ఎకరాల భూములను కొనుగోలు చేసిన వ్యవహారం బయటపడింది. తెల్లకార్డుదారుల భూబాగోతంపై విచారణ చేపట్టాలని సీఐడీ అధికారులు, సీబీఐ, ఈడీ, ఐటీ అధికారులకు సమాచారం అందించారు.
తాజాగా రాజధాని భూబాగోతంపై విచారణ చేపట్టిన ఈడీ అధికారులు అమరావతి భూముల కొనుగోలులో ఇన్‌సైడర్ ట్రేడింగ్ పాల్పడిన వారి వివరాలు, తెల్లకార్డుదారుల భూకొనుగోళ్లపై సీఐడీ అధికారుల నుంచి కీలక సమాచారం సేకరించారు. అమరావతి భూముల కొనుగోళ్లలో ఇన్‌సైడర్ ట్రేడింగ్ జరిగిందని, అలాగే ఇన్‌సైడర్ ట్రేడింగ్ ద్వారా పెద్ద ఎత్తున మనీలాండరింగ్ జరిగిందని ఈడీ తన ప్రాథమిక విచారణలో నిర్థారించింది. త్వరలోనే ఈడీ అధికారులు అమరావతిలో 761 ఎకరాలు కొనుగోలు చేసిన తెల్లకార్డుదారులకు నోటీసులు జారీ చేసి…వారిని పిలిపించి పూర్తి స్థాయిలో విచారణ చేపట్టారు. అసలు తెల్లకార్డులు ఎవరిపేరు మీద ఉన్నాయి..వారి ఆర్థిక స్థితి ఏంటీ…ఏకంగా అమరావతిలో భూములు ఎలా కొనుగోలు చేశారు.. డబ్బులు ఆశ చూపి..వారి చేత భూములు కొనుగోలు చేయించిన టీడీపీ నేతల వివరాలపై కూపీ లాగనున్నారు. తెల్లకార్డుదారులవారితో పాటు, వారి వెనుక ఉన్న వారిపై కూడా చర్యలు తీసుకునేందుకు ఈడీ అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు..అమరావతిలో ఇన్‌సైడర్ ట్రేడింగ్‌కు పాల్పడి…మనీలాండరింగ్ ద్వారా పెద్ద ఎత్తున విదేశాలకు నల్లడబ్బును తరలించిన టీడీపీ నేతల గుట్టు కూడా ఈడీ బయటపెట్టనుంది. మొత్తంగా ఈడీ విచారణతో అమరావతిలో ఇన్‌సైడర్ ట్రేడింగ్‌పై దమ్ముంటే విచారణ జరిపించండి అని తొడలు కొట్టిన చంద్రబాబు బ్యాచ్ గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి.