ఆసియాలోనే అతిపెద్ద వన జాతరైన తెలంగాణ రాష్ట్రంలోని మేడారం జాతరకు భక్తులు,ప్రజలు పోటెత్తున్నారు. ఈ నెల ఐదో తారీఖు నుండి ఎనిమిదో తారీఖు వరకు మహాజాతర జరగనున్నది.
ఈ రద్ధీని పురస్కరించుకుని భక్తులు,ప్రజలు ముందుగానే మేడారం చేరుకుంటున్నారు. ఇందులో భాగంగా నిన్న శుక్రవారం ఒక్కరోజే ఏకంగా నాలుగు లక్షల మంది దర్శించుకున్నారు.
రేపు ఆదివారం దాదాపు పది లక్షల మంది అమ్మల దర్శనానికి వస్తారని అధికారులు భావిస్తున్నారు. ఇక మహాజాతరకు తెలుగు రాష్ట్రాలతో పాటుగా ఛత్తీస్ గఢ్,మహరాష్ట్ర,ఒడిశా,మధ్యప్రదేశ్ రాష్ట్రాల నుండి కూడా భక్తులు,ప్రజలు తరలిరానున్నారు.