తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా.. అది రాకుండా రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తంగా ఉంది. దీనికి సంబంధించిన పలు చర్యలు తీసుకుంటుంది.
ఇందులో భాగంగా ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ పంపిన కరోనా టెస్టింగ్ కిట్లు నిన్న శుక్రవారం రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్లోని గాంధీ అసుపత్రికి చేరాయి.
ప్రస్తుతం ఈ ఆసుపత్రిలో పరిశీలనలో ఉన్న కరోనా అనుమానితులకు ఈ కిట్లతో పరీక్షలు చేస్తున్నారు. సస్పెక్టెడ్ కేసుల శాంపిల్స్ తో ట్రయల్స్ చేస్తున్నారు.
తాజాగా అందిన ఈ కిట్లతో ఐదారు గంటల్లోనే ఫలితాలు వస్తున్నాయని వైద్యులు చెప్తున్నారు. మరో వైపు ఇంకో నలుగురు కరోనా అనుమానితులు ఫీవర్ ఆసుపత్రిలో చేరారు.