ఏపీలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మరో భారీ సంక్షేమ పథకానికి శ్రీకారం చుట్టారు. నాయీ బ్రాహ్మణులు, టైలర్లకు రూ.10వేల ఆర్ధిక సాయం అందిచేందుకు జగనన్న చేదోడు కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రారంభించనుంది. ఈమేరకు ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం వెనుకబడిన తరగతుల సంక్షేమశాఖ ద్వారా ఐదేళ్ల పాటు ప్రతీ ఏడాది రూ10 వేల చోప్పున ఆర్ధికసాయం అందించాలని నిర్ణయం తీసుకుంది. రజకులు, నాయీ బ్రాహ్మణులు, టైలర్లకు ఆర్ధిక సాయంగా ఏడాదికి పది వేల రూపాయలు ఇచ్చేందుకు వెనుకబడి తరగతుల సంక్షేమశాఖ ఉత్తర్వులు ఇచ్చింది. గతంలో ప్రజాసంకల్పయాత్ర పాదయాత్రలు ముఖ్యమంత్రి జగన్ తాను అధికారంలోకి వస్తే బ్రాహ్మణులకు నెలకు పదివేల రూపాయలు ఇస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే.
