దేశంలో సంక్షోభంలో కూరుకుపోయిన అన్నదాతలకు కేంద్ర ప్రభుత్వం శుభవార్తను తెలిపింది. ఇందులో భాగంగా సాగు ,వ్యవసాయ రంగానికి పూర్వవైభవాన్ని తీసుకొచ్చేందుకు పదహారు సూత్రాల కార్యాచరణను ప్రకటించింది. ఈ రోజు శనివారం ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ ను కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టారు. వచ్చే రెండేళ్లలో రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడమే లక్ష్యంగా పనిచేస్తామని తెలిపారు. మొత్తం 6.1కోట్ల మంది రైతులు ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన అందిస్తున్నామని పేర్కొన్నారు. వ్యవసాయ రంగానికి కేంద్రం ప్రకటించిన వరాలు ఇవే..!
నీటి లభ్యత తక్కువగా ఉన్న 100 జిల్లాలకు ప్రయోజనం కలిగించేలా పథకాలు
సౌరశక్తి ద్వారా పంపుసెట్ల నిర్వహణకు ప్రోత్సాహకాలు
కొత్తగా 15లక్షల మంది రైతులకు సోలార్ పంపులు
రసాయన ఎరువుల వినియోగాన్ని తగ్గించి..సేంద్రీయ ఎరువుల వినియోగం పెంచేందుకు చర్యలు
సేంద్రీయ ఉత్పత్తుల విక్రయానికి ఆన్‌లైన్ పోర్టల్
దేశంలో 160 మిలియన్ మెట్రిక్ టన్నుల నిల్వ సామర్థ్యం
గ్రామాల్లో ధాన్యలక్ష్మి పథకం స్వయ సహాయక బృందాలతో గ్రామాల్లో గిడ్డంగి సదుపాయం
ధాన్యలక్ష్మి పథకానికి ముద్ర, నాబార్డ్ సాయం
పాలు, చేపల రవాణాకు కిసాన్ రైలును ప్రారంభించనున్న భారతీయ రైల్వే
పీపీపీ భాగస్వామ్యంతో కిసాన్ రైలు
కృషి ఉడాన్ పేరుతో వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతికి విమానాలు
ఉద్యానవన ఉత్పత్తులు 311 మిలియన్ మెట్రిక్ టన్నులకు చేరాయి
2020-21లో అగ్రికల్చర్ రీఫైనాన్స్ లక్ష్యం రూ.15 లక్షల కోట్లు
ప్రస్తుతమున్న 58 లక్షల స్వయం సహాయక బృందాలను మరింత విస్తరిస్తాం
వ్యవసాయ రంగానికి రూ.2.83 లక్షల కోట్లు కేటాయింపు
గ్రామీణాభివృద్ధి, పంచాయితీ రాజ్ కోసం 1.23 లక్షల కోట్లు
మత్స్యకారుల కోసం సాగర్‌మిత్ర పథకం