చంద్రబాబు అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే అమరావతిని రాజధానిగా ప్రతిపాదించిన విషయం అందరికి తెలిసిందే. అయితే అంతకు ముందు టీడీపీ నాయకులు, బాబు బంధువులు ఇలా తన సొంత వాళ్ళు అందరూ ముందుగానే ఇల్లు చక్కబెట్టేసారు. అంటే రాజధాని అనౌన్స్మెంట్ రాకముందే అక్కడ భూములను కొనేసారు. అంతేకాకుండా అటు భోగాపురం ఎయిర్పోర్ట్ విషయంలో కూడా అదే జరిగింది. దీనిపై ట్విట్టర్ వేదికగా స్పందించిన విజయసాయి రెడ్డి “భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రకటనకు ముందే ఇన్సైడర్ ట్రేడింగులో చంద్రబాబు బినామీలు చుట్టుపక్కల భూములను చుట్టేశారు. దానిపైనా విచారణ జరిగితే నీతిచంద్రికల బండారం బయట పడుతుంది. విశాఖలో నిబంధనలకు విరుద్ధంగా ఇచ్చిన అనుమతులు, కోస్టల్ రెగ్యులేషన్ల అతిక్రమణలు, మీరు చేయని అక్రమాలు లేవు” అని మండిపడ్డారు.