అచ్చం మహానేత లాగా..నాడు మహానేత.. నేడు జననేత. ఇద్దరిదీ ఒకటే మాట.. ఒకటే బాట. వారి లక్ష్యం.. ప్రజా సంక్షేమమే. అందుకే జనం గుండెల్లో పెట్టుకుని చూసుకుంటున్నారు. ఆ మహానేత డాక్టర్. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ని ప్రజల పాలిట దేవుడ్డయ్యాడు ఎందుకంటే ఆయన పెట్టిన పథకాలు అలాంటివి. దాంతో ప్రజలు మెచ్చిన నాయకుడయ్యాడు. ఇప్పుడు అదే తీరులో తండ్రికి తగ్గ తనయుడిగా పేరు తెచ్చుకున్నాడు. అయితే తాజాగా జరిగిన కల్లెక్టర్స్ మీటింగ్ లో జగన్ మాటలు వింటుంటే ఒక్కసారిగా అందరికి ఆయనే గుర్తొచ్చారు. రాష్ట్రంలో అందరికి ఇండ్ల స్థలాలు ఇవ్వాలని వారిని ఆదేశించారు. నేను ప్రతీ గ్రామానికి వెళ్తాను వారిని ఎవరికైనా ఇళ్ల స్థలాలు రాలేదా అని అడిగితే ఎవ్వరూ చేయి లేపకూడదు, అప్పుడే మీ పనితీరు తెలుస్తందని అదేగాని జరిగితే మీ పనితీరుకు బంగారు పతకాలతో సత్కరిస్తాను అని చెప్పారు.
