Home / ANDHRAPRADESH / ఇండికా కారులో వచ్చి..కత్తులతో, బండరాళ్లతో..కర్నూల్ జిల్లాలో దారుణ హత్య

ఇండికా కారులో వచ్చి..కత్తులతో, బండరాళ్లతో..కర్నూల్ జిల్లాలో దారుణ హత్య

కర్నూల్ జిల్లాలోని ఉప్పలపాడు, ఉయ్యాలవాడ గ్రామాల మధ్య గురువారం సాయంత్రం ఓ వ్యక్తి దారుణహత్యకు గురయ్యాడు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలు.. వెల్దుర్తి మండలం బుక్కాపురం గ్రామానికి చెందిన వడ్డె చిన్నయ్య కుమారుడు వడ్డె లక్షన్న(40) కల్లూరు మండలం నాయకల్లు గ్రామానికి చెందిన పార్వతమ్మను వివాహం చేసుకున్నాడు. వీరికి శివలలిత, రాజేశ్వరితో పాటు కుమారుడు సంతానం. మొదటి కూతురు శివలలితను ఉయ్యాలవాడ గ్రామానికి చెందిన రమేష్‌కు ఇచ్చి వివాహం చేశాడు. మిగతా ఇద్దరు పిల్లలు, భార్యతో కలిసి పదేళ్ల పాటు భార్య పుట్టినిల్లు నాయకల్లులో నివాసం ఉండేవారు. గత ఏడాది రంజాన్‌ పండుగ సందర్భంగా (2019 జూన్‌ 5న) ఇంటి గోడ విషయంలో జరిగిన ఘర్షణలో యువకుడు వడ్డె వెంకటేశ్వర్లు(19), లక్ష్మన్న గొడవ పడ్డారు. ఈ గొడవలో వెంకటేశ్వర్లు అక్కడికక్కడే మృతి చెందడంతో ఉల్లిందకొడ పోలీసులు ప్రధాన ముద్దాయి లక్ష్మన్నతో పాటు మరో ఐదుగురిపై కేసు నమోదు చేశారు. నిందితులను అరెస్ట్‌ చేసి కోర్టుకు తరలించగా, ఆరు నెలల క్రితం బెయిల్‌పై బయటకు వచ్చారు. అనంతరం లక్ష్మన్న స్వగ్రామైన బుక్కాపురం గ్రామానికి మకాం మార్చాడు. గ్రామంలో కొంతకాలంగా బర్రెలను మేపుకుంటూ జీవనం సాగించాడు. పది రోజుల నుంచి ఓ గ్రానైట్‌ ఫ్యాక్టరీలో పనులకు వెళ్లేవాడు.

గురువారం సాయంత్రం ఐదుగురు ప్రత్యర్థులు ఏపీ 21ఎల్‌ 4055 నంబర్‌ ఇండికా కారులో వచ్చి పథకం ప్రకారం లక్ష్మన్నను కత్తులతో విచక్షణ రహితంగా పొడిచి, తలపై బండరాళ్లతో మోది హత్య చేసి పరారైనట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపినట్లు పోలీసులు పేర్కొన్నారు. అదే సమయంలో హతుడి చిన్నాన్న కుమారుడు ఎల్లనాగన్న బండల లోడుతో ట్రాక్టర్‌ను తీసుకొచ్చేలోగా ప్రత్యర్థులు కారులో పరారయ్యారు. ట్రాక్టర్‌ ద్వారా కొంత దూరం వెంటాడినా ఫలితం దక్కలేదని స్థానికులు చెబుతున్నారు. ప్రత్యర్థుల కారు డీఆర్‌డీఓ ప్రాజెక్టు, కాల్వబుగ్గ మీదుగా జాతీయ రహదారిపై వెళ్లినట్లు అక్కడ అమర్చిన సీసీ కెమరాల ఆధారంగా గుర్తించారు. ఓర్వకల్లు ఎస్‌ఐ సుధాకర్‌రెడ్డి ఘటనా స్థలానికి చేరుకొని తాలూకా సీఐ శ్రీనాథ్‌రెడ్డికి సమాచారమివ్వడంతో ఆయన అ క్కడికి చేరుకుని పరిసరాలను పరిశీలించారు. మృతుని భార్య పార్వతి ఫిర్యాదు మేరకు కేసు నమో దు చేసుకొని, మృతదేహాన్ని కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు ఎస్‌ఐ తెలిపారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat