టాలీవుడ్ నటి మాధవి లత తన మరణం గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. తన అధికారక ఎఫ్బీ ఖాతాలో పోస్టులో చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం పెనుసంచలనం సృష్టిస్తున్నాయి. తన ఎఫ్బీలో వాల్ పై ” నా ఫ్రెండ్స్ తో చెప్తూ ఉంటాను.
ఏదో రోజు ప్రేమ సినిమాలో రేవతిలా చనిపోతాను అని .. రేవతి లాగా తనకు చివరికి ఏ మెడిసన్ పని చేయదు. నన్ను ఏడిపించే మైగ్రేన్ ,తలనొప్పి,జలుబు-జ్వరం ,నిద్రలేమి కోసం మందులు,కన్న కలలు ,కోరికలు ,ఆశలు ..వీటి వలన నా ఆయుష్షు ఉండదు.
ఈ మందులు నా ఆయుష్షు ఉంచలేవు “అని అంటూ పోస్టు చేసింది. మాధవి లత చేసిన పోస్టుకు నెటిజన్లు మద్ధతుగా ధైర్యానిస్తూ కామెంట్లు చేస్తున్నారు.