తెలంగాణ రాష్ట్ర ఐటీ ,పరిశ్రమల మరియు మున్సిపల్ శాఖ మంత్రి కేటీ రామారావు ఈ రోజు శుక్రవారం హైదరాబాద్ మహానగరంలోని మాదాపూర్ హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్లో క్రెడాయ్ ప్రాపర్టీ షో 2020ను ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ” ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకోచ్చిన టీఎస్ఐపాస్ తరహాలోనే భవన నిర్మాణ అనుమతులకోసం టీఎస్ బీపాస్ ను తీసుకోస్తామని తెలిపారు. టీఎస్ ఐపాస్ మాదిరిగా టీఎస్ బీపాస్ ను దేశానికి ఆదర్శంగా తీర్చిదిద్దుతాము.తెలంగాణలో ఉన్న రాజకీయ స్థిరత దేశంలో ఏ రాష్ట్రంలో కూడా లేదు. కేవలం నాలుగంటే నాలుగేళ్లలోనే భవన నిర్మాణ కార్మికుల సమస్యలతో పాటుగా బిల్డర్ల సమస్యలన్నీ పరిష్కరించాము. సక్కని కార్యదక్షత,సమర్థత,విజన్ ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్ లాంటి నాయకుడు తెలంగాణకు ఉండటం అదృష్టం అని అన్నారు.
తెలంగాణేర్పడిన మొదట్లో 2014లో జేఎల్‌ఎల్ రేటింగ్స్‌లో హైదరాబాద్ టాప్-20లో లేదు. కానీ 2020లో 130 నగరాలను వెనక్కి నెట్టి అగ్రస్థానంలో నిలిచిందని తెలిపారు. క్వాలిటీ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పెరగాలని మంత్రి పేర్కొన్నారు.