ఏపీ శాసనమండలి రద్దు, కేంద్రం ఆమోదం, వికేంద్రీకరణపై హైకోర్టులో కేసులు, విచారణ తదితర అడ్డంకులు ఉన్నా జగన్ సర్కార్ మూడు రాజధానుల ఏర్పాటుపై ముందడుగు వేస్తోంది. మార్చి 25 నుంచి విశాఖ నుంచి పాలన స్టార్ట్ చేయడానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో టీడీపీ అనుకుల మీడియా ఛానళ్లలో పథకం ప్రకారం విశాఖపై విషప్రచారం మొదలైంది. దీనిపై స్పందించిన వైసీపీ సీనియర్ నేత విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా స్పందించారు. “ఎన్టీఆర్ మండలిని రద్దు చేసిన విషయాన్నిఎల్లో మీడియా, బాబు గ్యాంగ్ ప్రస్తావించడం లేదు. వైఎస్సార్ గారు పునరుద్ధరించడాన్ని పదేపదే చెబుతున్నారు. 1985, 2005లో రెండు సందర్భాల్లో మండలి ఏర్పాటును వ్యతిరేకిస్తూ ఉపన్యాసం దంచాడు. మీ రెండు నాల్కల ధోరణి వీడియోల సాక్షిగా బయటపడిందిప్పుడు” అని అన్నారు.