తెలంగాణ రాష్ట్రంలో ఇటీవలే మున్సిపల్ ఎన్నికలు జరిగిన సంగతి విదితమే. ఈ ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ 119 మున్సిపాలిటీల్లో,9కార్పోరేషన్లో విజయకేతనం ఎగురవేసింది. అయితే తాజాగా రాష్ట్రంలో సహకార సంఘం ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. ఫిబ్రవరి నెల మూడో తారీఖున నోటిఫికేషన్ విడుదల కానున్నది.
ఫిబ్రవరి ఆరో తారీఖు నుండి ఎనిమిది తారీఖు వరకు నామినేషన్లు స్వీకరించబడతాయి. ఫిబ్రవరి తొమ్మిదో తారీఖున దాఖలైన నామినేషన్లు పరిశీలించబడతాయి. పదో తారీఖున నామినేషన్లను ఉపసంహరణకు తుది గడువు. అదే నెల పదిహేనో తారీఖున ఉదయం ఏడు గంటల నుండి మధ్యాహ్నాం ఒకటి గంట వరకు పోలింగ్ జరుగుతాయి.
అదే రోజు ఫలితాలు ప్రకటించబడతాయి. మొత్తం ముప్పై రెండు జిల్లాల్లో 906 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు ఉన్నాయి. వీటిలో 18లక్షల 42వేల 412మంది ఓటర్లు ఓటుహక్కును వినియోగించుకోనున్నారు.