అంతర్జాతీయ దిగ్గజ కంపెనీల సీఈఓ ల జాబితాలో మరో ఇండీయన్ చేరారు. అమెరికాకు చెందిన ప్రపంచ ప్రఖ్యాత ఐటీ కంపెనీ దిగ్గజం ఐబీఎం సీఈఓగా భారత సంతతికి చెందిన వ్యక్తి నియమితులైనారు. ఆ పదవీలో ఉన్న రోమెట్టి పదవీ విరమణ చేశారు. దీంతో అరవింద్ కృష్ణ(57)ని నియమిస్తూ ఐబీఎం ఒక ప్రకటనను విడుదల చేసింది.ప్రస్తుతం ఆ కంపెనీ క్లౌడ్ అండ్ కాగ్నిటివ్ సాప్ట్ వేర్ విభాగానికి చీఫ్ గా అరవింద్ వ్యవహరిస్తున్నారు. రెడ్ హ్యాట్ టెక్నాలజీ కొనుగోలులో ఆయన కీలక పాత్ర పోషించారు.
