Home / ANDHRAPRADESH / ఛీఛీ…వీళ్లు తెలుగు తమ్ముళ్లా..కామాంధులా… టీడీపీ ఆఫీసులో చిన్నపిల్లాడిపై గ్యాంగ్‌రేప్..!

ఛీఛీ…వీళ్లు తెలుగు తమ్ముళ్లా..కామాంధులా… టీడీపీ ఆఫీసులో చిన్నపిల్లాడిపై గ్యాంగ్‌రేప్..!

తెలుగు తమ్ముళ్ల పైశాచికత్వానికి అడ్డూ అదుపూ లేకుండా పోయింది..గత ఐదేళ్ల చంద్రబాబు హయాంలో తెలుగు తమ్ముళ్లు కాల్‌మనీ సెక్స్ రాకెట్ పేరుతో ఆడవాళ్ల ధన, మాన, ప్రాణాలతో చెలగాటం ఆడిన సంగతి తెలిసిందే. ఇక జన్మభూమి కమిటీల పేరుతో గ్రామాల్లో టీడీపీ నేతల అరాచకానికి అంతే లేకుండా పోయింది. మహిళలపై ఇష్టారాజ్యంగా అత్యాచారాలకు, లైంగికవేధింపులకు పాల్పడేవారు. పట్టపగలు ఓ దళిత మహిళను బట్టలూడిదీసి కొట్టిన దుర్మార్గం టీడీపీ నేతలది..సాక్షాత్తు ఓ మహిళా ఎమ్మార్వోపై అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్న చింతమనేని ప్రభాకర్ జుట్టుపట్టుకుని లాగి పట్టుకుని కొడితే ..బాధిత ఎమ్మార్వోకే చివాట్లేసి పంపించిన ఘనత చంద్రబాబుది. ఇప్పుడు అధికారం కోల్పోయిన తర్వాత కూడా తెలుగు తమ్ముళ్లు రెచ్చిపోతూనే ఉన్నారు. ఆఖరకు పసిపిల్లాడిపై గ్యాంగ్ రేప్‌కు తెగబడ్డారు.

తాజాగా కర్నూలు జిల్లా అవుకు పట్టణంలోని టీడీపీ పార్టీ కార్యాలయంలో దారుణం చోటుచేసుకుంది. బాలుడిని డిన్నర్‌ పేరుతో పిలిచి నలుగురు యువకులు సామూహిక అత్యాచారం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. అవుకు పట్టణానికి చెందిన ఒక బాలుడు (14) వారం క్రితం ఒంటరిగా ఆడుకుంటుండగా డిన్నర్‌ పేరుతో నలుగురు యువకులు టీడీపీ కార్యాలయంలోకి బలవంతంగా తీసుకెళ్లి సామూహికంగా అత్యాచారానికి పాల్పడ్డారు. బాలుడికి రక్తస్రావమై అస్వస్థతకు గురి కావడంతో కుటుంబ సభ్యులు ఆరా తీయగా అసలు విషయం బయటపడింది. దీంతో బాలుడి తల్లిదండ్రులు అతన్ని ఆసుపత్రికి తీసుకెళ్లారు. తమ అబ్బాయి లైంగిక దాడికి గురయ్యాడన్న విషయం తెలుసుకున్న బాలుని తల్లిదండ్రులు అవుకు పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కాగా బాలుడిని చిత్రహింసలకు గురి చేసిన వారిలో బుల్లెట్‌ రాజు, ప్రేమ్‌ కుమార్‌, రాజుతో పాటు మరొకరు ఉన్నట్లు, వీరంతా టీడీపీ కార్యకర్తలుగా గుర్తించామని పోలీసులు పేర్కొన్నారు. వీరిపై సెక్షన్‌ 377 కింద ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నట్లు పోలీసులు వెల్లడించారు. ప్రస్తుతం ఇద్దరిని అదుపులోకి తీసుకున్నామని, వీరిపై గతంలోనే పలు రౌడీషీట్‌ కేసులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. వీళ్ల కామం తగలెయ్య…పసిపిల్లాడిపై అత్యాచారం చేయడమేంటని…సదరు టీడీపీ కార్యకర్తలపై అవుకు ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే ఇంతటి దారుణానికి పాల్పడ్డ తెలుగు తమ్ముళ్లను కఠినంగా శిక్షించాలని అవుకు ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat