అక్కినేని సమంత టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ లలో ఒకరు. పెళ్లి అయిన సరే ఇంకా అదే గ్లామర్ తో నటనతో అక్కినేని ఫ్యామిలీకి మంచి పేరు తెచ్చిపెట్టింది. ఎవరైనా పెళ్లి అయితే వారి ట్రెండ్ మొత్తం పడిపోతుంది. కాని ఈ ముద్దుగుమ్మ విషయంలో అంతా రివర్స్ లో జరుగుతుంది. అప్పటికన్నా ఇప్పుడే తన అందచందాలతో అందరిని మత్తెక్కిస్తుంది. ఇక అసలు విషయానికి వస్తే ఈ ముద్దుగుమ్మకు పెళ్లి అయిందని తెలిసి కూడా ఒక అభిమాని లవ్ ప్రపోజ్ చేసాడు. అసలే సమంత సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు తన అప్డేట్స్ పెడుతూ అభిమానులను ఉత్సాహ పరుస్తుంది. కాని ఈసారి ఆ ప్రపోజ్ చూసిన సామ్ అక్కడితో ఆగకుండా దానికి రిప్లై కూడా ఇచ్చింది. ఆ రిప్లై చూసిన అందరూ షాక్ అయ్యారు. ఇక ఆ అభిమాని సమంతా ఐ లవ్ యూ..ఐ లవ్ యూ జాను అని మూడు గంటలు ప్రేమలేఖ రాసాడు. దానికి సమంత ఇది మీ అమ్మగారు చూస్తే నాపై కోపగిస్తారు..ని అభిమానానికి చాలా థాంక్స్ బాగా చదువుకో అంటూ లవ్ సింబల్ పెట్టి రిప్లై ఇస్తుంది. దాంతో ఆ అభిమాని ఒక్కసారిగా ఎగిరి గంత్తేసాడు.
