అహింసా, సత్యాగ్రహాలే ఆయుధంగా అహింసామార్గంలో తెల్లవాడిని తరిమికొట్టి అఖండ భారతావనికి స్వేచ్ఛా స్వాతంత్ర్యాలు ప్రసాదించిన భారత జాతిపిత మహాత్మాగాంధీ వర్థంతి నేడు. ఈ సందర్భంగా ఏపీ ముఖ్యమంత్రి
వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం తన నివాసంలో మహాత్ముని చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. దేశానికి స్వాతంత్ర్యం అందించిన గొప్ప నాయకుడు మహాత్మాగాంధీ అని స్మరించుకున్నారు. మహాత్మాగాంధీ వర్ధంతి సందర్భంగా ఆయన బోధనలైన అహింస, సత్యాగ్రహం, సర్వోదయ కోసం పునరంకితమవుదామని సీఎం వైఎస్ జగన్ పిలుపునిచ్చారు. అదేవిధంగా దేశంకోసం ప్రాణాలర్పించిన అమరులకు ఆయన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సీఎం జగన్‌తో పాటు మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
