మెగాస్టార్ చిరంజీవికి అమ్మ అంజనాదేవి అంటే ఎంత ఇష్టమే ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన ఎంత బిజీగా ఉన్నా ఎవరితో ఉన్నా అమ్మ తరువాతే ఏదైనా. తన కష్టసుఖాలు అన్ని తనతో చెప్పుకుంటారు చిరు. అయితే ఇక అసలు విషయానికి వస్తే నిన్న అంటే జనవరి 29న ఆమె పుట్టినరోజు కావడంతో ఫ్యామిలీ మొత్తం ఆమెతో సరదాగా గడిపి సంతోషంగా రోజంతా ఎంజాయ్ చేసారు. భార్య సురేఖ కూతురు సుస్మిత, నిహారికతో పాటు మెగా సిస్టర్స్ ఇందులో ఉన్నారు. అనంతరం ఆమెతో కేక్ కట్ చేయించారు. అమ్మ దగ్గర చిన్న పిల్లాడిలా మారిపోయిన చిరు ఆమెతో సేల్ఫీ తీసుకున్నాడు. ప్రస్తుతం ఆ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
