ఏపీ శాసనమండలిలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన మూడు రాజధానుల బిల్లును అడ్డుకునేందుకు చంద్రబాబు చేసిన కుట్ర బెడిసికొట్టింది. నిబంధనలకు వ్యతిరేకంగా స్పీకర్ షరీఫ్ వికేంద్రీకరణ బిల్లును సెలెక్ట కమిటీకి పంపండంతో ఆగ్రహించిన జగన్ సర్కార్ ఏకంగా శాసనమండలిని రద్దు చేస్తూ తీర్మానాన్ని కేంద్రానికి పంపింది. ఇక కేంద్రం రాజ్యాంగబద్ధంగా వ్యవహరించి శాసనమండలి రద్దు బిల్లును పార్లమెంట్ ఉభయసభల్లో ఆమోదించడమే తరువాయి … లోకేష్‌తో సహా 28 మంది టీడీపీ ఎమ్మెల్సీల పదవులు ఊడిపోతాయి. దీంతో తమ అధినేత కుట్రలకు తాము బలైపోయామంటూ టీడీపీ ఎమ్మెల్సీలు లబోదిబోమంటున్నారు. తమ రాజకీయ భవిష్యత్తు ఏంటని చంద్రబాబును నిలదీస్తున్నారు. దీంతో బాబు ఎమ్మెల్సీలకు ధైర్యం నూరిపోసే ప్రయత్నాలను ఆరంభించారు. తాను బీజేపీ పెద్దలతో మాట్లాడుతున్నానని..మండలి రద్దు కాకుండా మేనేజ్ చేస్తున్నానని ఎమ్మెల్సీలకు చెబుతున్నాడంట…మండలి రద్దుపై అసెంబ్లీ పంపిన తీర్మానం పార్లమెంట్ ముందుకు రాకుండా ఉండేందుకు చంద్రబాబు బీజేపీలోని సుజనా చౌదరి లాంటి వాళ్లతో ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం.
ఒకవైపు మండలి రద్దు అంశాన్ని పార్లమెంట్‌లో ప్రస్తావించడం..మరోవైపు తీర్మానం ఉభయసభల ముందుకు రాకుండా అడ్డుకోవడమే లక్ష్యంగా చంద్రబాబు ఢిల్లీకి వెళ్లి సుజనాచౌదరిలాంటి వాళ్లతో కలిసి కుట్రలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ రెండూ వర్కవుట్ కాకపోతే ఏకంగా సగం మందికిపైగా టీడీపీ ఎమ్మెల్సీలను బీజేపీలోకి పంపి వారి పదవులను కాపాడేలా చంద్రబాబు స్కెచే వేసినట్లు పార్టీలో చర్చ జరుగుతోంది. తమ ఎమ్మెల్సీలు బిజేపీలోకి వెళితే…కేంద్రం కచ్చితంగా మండలి రద్దు నిర్ణయాన్ని రాజకీయ కారణాలతో ఆపేస్తుందని…చంద్రబాబు ఆలోచన అని టీడీపీ నేతలు అంటున్నారు.తమ పార్టీ ఎమ్మెల్సీలు బీజేపీలోకి వెళ్లినా సుజనాచౌదరిలాగా తన మాటే వింటారని..అదే సమయంలో బీజేపీ బలం పెరిగినట్లు మోదీ, షాలు భావిస్తారని…తద్వారా మండలి రద్దును కేంద్రం తిరస్కరిస్తుందని చంద్రబాబు చెబుతున్నట్లు తెలుస్తోంది. 2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు మోదీని దించేస్తా…పెళ్లాం వదిలేసినోడు అంటూ నానా బూతులు తిట్టిన చంద్రబాబు ఎన్డీయే మళ్లీ అధికారంలోకి రాగానే కేసుల భయంతో వెంటనే తన నలుగురు రాజ్యసభ ఎంపీలను బీజేపీలోకి పంపించాడు. ఇప్పుడు శాసనమండలిలో తన కొడుకు పదవి కాపాడుకోవడం కోసం తన పార్టీ ఎమ్మెల్సీలను బీజేపీలోకి పంపించేందుకు సిద్ధమవుతున్నాడు. ఇదీ మండలి రద్దును అడ్డుకునేందుకు బాబు ఆడుతున్న కుటిల రాజకీయం..ఔరా.. ఆఖరకు కొడుకు పదవి కోసం ఎంతగా దిగజారిపోయావు చంద్రబాబు..