Home / ANDHRAPRADESH / విశాఖపై విషప్రచారం..మంత్రి కన్నబాబు ఫైర్..!

విశాఖపై విషప్రచారం..మంత్రి కన్నబాబు ఫైర్..!

ఏపీలో అధికార, పాలనా వికేంద్రీకరణలో భాగంగా జగన్ సర్కార్ విశాఖలో పరిపాలనా రాజధాని ఏర్పాటుకు ముందడుగు వేస్తోంది. అయితే టీడీపీ అధినేత చంద్రబాబు మాత్రం విశాఖలో రాజధాని ఏర్పాటుపై తీవ్ర అభ్యంతరం చెబుతున్నారు. తన అను”కుల” మీడియాతో విశాఖపై విష ప్రచారం చేయిస్తున్నారు. కడప గూండాలు వచ్చి కబ్జాలు చేస్తారని విశాఖ ప్రజలను భయభ్రాంతులు చేసేలా అనుకుల ప్రతికల్లో వార్తలు రాయిస్తున్నారు.. విశాఖకు తరచుగా తుఫానులు వస్తాయని, రక్షణాపరంగా కూడా సేఫ్ కాదని, రాజధానిగా ఏ మాత్రం పనికిరాదని..బాబు దుష్ప్రచారం చేయిస్తున్నారు.

ఆ‌ఖరకు జీఎన్‌రావు కమిటీ కూడా విశాఖలో రాజధాని ఏర్పాటు చేయమని చెప్పలేదంటూ బాబు అనుకుల ఛానళ్లు సన్నాయినొక్కులు నొక్కుతున్నాయి.పర్యావరణపరంగా విశాఖపట్నం ఎంతో సున్నితమైన జోన్‌లో ఉందని.. తీవ్రమైన తుఫాన్లు, వరదలతోపాటు సముద్రమట్టం పెరగడమనే పెనుముప్పు విశాఖ నగరానికి ఉందని… జీఎన్‌ రావు కమిటీ పేర్కొందని ఎల్లోమీడియా రాసుకొచ్చింది. అంతేకాదు విశాఖపట్నం, దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో ప్రభుత్వ కార్యాలయాలను నెలకొల్పేందుకు అవసరమైన ప్రభుత్వ భూములు లేవని తన నివేదికలో తెలిపిందంటూ బాబుకు బాకా వూదే రెండు పత్రికలు, ఛానళ్లు రెండు, మూడు రోజులుగా విశాఖపై విషం కక్కుతున్నాయి. విశాఖ రాజధాని విషయంలో తమ కమిటీపై చంద్రబాబు అనుకుల మీడియాతో చేయిస్తున్న ప్రచారంపై స్వయంగా జీఎన్‌రావు స్పందించారు. ఏపీ ఎగ్జిక్యూటివ్ కేపిటల్‌గా విశాఖ నగరాన్ని మించినది మరొకటి లేదని జీఎన్‌రావు బల్ల గుద్ది మరీ చెప్పేశారు. ఏపీ పరిపాలనా రాజధానిగా విశాఖపట్నం మెట్రోపాలిటన్‌ ఏరియాలో సముద్రానికి దూరంగా ఉన్న వాయవ్య ప్రాంతం సరిగ్గా సరిపోతుందని జీఎన్‌రావు స్పష్టం చేశారు.

తాజాగా విశాఖపై జరుగుతున్న విషప్రచారంపై మంత్రి కురసాల కన్నబాబు స్పందించారు. విశాఖపట్నంలో తుఫాన్లు వస్తాయంటున్నారు.. మరి ఇతర ప్రాంతాల్లో రావా? ముంబై, చెన్నై నగరాలు సముద్ర తీరం వద్దే ఉన్న విషయం చంద్రబాబు అండ్‌ టీంకు తెలియదా? అని ప్రశ్నించారు. ఎల్లో మీడియాను అడ్డు పెట్టుకుని చంద్రబాబు విశాఖపై విష ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఏ జీఎన్‌రావు కమిటీ నివేదికలను భోగిమంటల్లో వేసిన చంద్రబాబుకు, టీడీపీ నేతలకు, ఎల్లోమీడియా ఛానళ్లకు అదే జీఎన్‌రావు కమిటీ నివేదిక భగవద్గీతలా మారిపోయిందని ఎద్దేవా చేశారు..అసలు ఎనిమిది నెలల కిందటే చంద్రబాబును టీడీపీ పార్టీని ప్రజలు భోగి మంటల్లో వేశారని కన్నబాబు ఫైర్ అయ్యారు. అమరావతిలో ఇటీవలే భూకంపం వచ్చింది. మరి భూకంపంవచ్చే ప్రాంతంలో చంద్రబాబు రాజధాని ఎందుకు పెట్టారని మంత్రి ప్రశ్నించారు. మొత్తంగా అనుకుల మీడియాను అడ్డంపెట్టుకుని విశాఖపై విషప్రచారం చేయిస్తున్న చంద్రబాబుపై మంత్రి కన్నబాబు ఓ రేంజ్‌‌లో ఫైర్ అయ్యారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat