చైనాతో పాటు పలు అగ్రదేశాలను వణికిస్తున్న కరోనా వైరస్ ప్రస్తుతం భారతీయులను కూడా వణికిస్తుంది. ఎందుకంటే కేరళలోని ఈ వైరస్ కు సంబంధించి మొదటి కేసు నమోదయింది. ఇక్కడ ఒక విద్యార్ధికి పరీక్షలు నిర్వహించగా కరోనా సోకినట్లు తెలిసింది. ప్రస్తుతం ఆ యువకుడి పరిస్థితి బాగానే ఉందని, వైద్యుల రక్షణలో ఉన్నాడని తెలుస్తుంది. ఈ యువకుడు వుహాన్ లో చదువుకుంటున్నాడు. అక్కడ వైరస్ ఎక్కువ అవ్వడంతో తిరిగి ఇంటికి వచ్చేసాడు. ఇక ఇప్పటికే త్రిపుర కు చెందిన ఒక వ్యక్తి మలేసియాలో ఈ వైరస్ వల్ల చనిపోయినట్టు అధికారికంగా ప్రకటించడం జరిగింది. చైనా నుండి వచ్చిన ఎవరికైనా అటువంటి అనుమానం వస్తే వెంటనే చూపించుకోవాలని సూచించడం జరిగింది.
