ఛలో సినిమాతో టాలీవుడ్ కు పరిచయం అయిన హీరోయిన్ రష్మిక. ఈ కన్నడ భామ తన మొదటి సినిమా హిట్ తోనే హిట్ అందుకుంది. అనంతరం విజయ దేవరకొండతో గీత గోవిందం చిత్రంలో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఆ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి. ఇవన్నీ పక్కన పెడితే సరిలేరు నీకెవ్వరు సినిమాలో టాలీవుడ్ నెం.1 హీరో మహేష్ సరసన నటించి ఈ ఏడాది మొదటి హిట్ కొట్టేసింది. మహేష్ పక్కన అంటే అది మామోలు విషయం కాదనే చెప్పాలి. ఇక ఇదే ఏడాది మరో సినిమా కూడా విడుదల కానుంది. అదే భీష్మ..ఇందులో నితిన్ సరసన నటించగా, ఇది కూడా హిట్ అయితే ఇక రష్మికకు తిరుగుండదని చెప్పాలి. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఒక సాంగ్ లోని పోస్టర్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. అందులో రష్మిక చాలా రొమాంటిక్ గా కనిపిస్తుంది.
