న్యూజిలాండ్ వేదికగా జరుగుతున్న ఐదు టీ20 మ్యాచ్ లలో భాగంగా నేడు హామిల్టన్ లో మూడో టీ20 జరిగింది. మొదటి రెండు మ్యాచ్ లలో ఇండియా గెలిచింది. ఇక మూడో మ్యాచ్ విషయానికి వస్తే ఎవరూ ఊహించని విధంగా మ్యాచ్ టై అయింది. చివరి ఓవర్ లో షమీ అద్భుతమైన బౌలింగ్ తో రెండు వికెట్లు తీసాడు. భారత్ నిర్ణీత 20ఓవర్లలో 179/5 పరుగులు చేయగా..న్యూజిలాండ్ కూడా 179/6 పరుగులు చేయడం జరిగింది. దాంతో మ్యాచ్ డ్రాగా ముగిసింది. దాంతో సూపర్ ఓవర్ ఆడడం జరిగింది. ఇక ఇందులో మొదటి బ్యాట్టింగ్ చేసిన కివీస్ బూమ్రా బౌలింగ్ లో ఏకంగా 17 పరుగులు చేసింది. అనంతరం చేజింగ్ కు దిగిన ఇండియా రోహిత్ శర్మ తనశైలిలో సిక్స్ తో భారత్ కు విజయం అందించాడు. దాంతో మూడో టీ20 తో పాటు సిరీస్ గెలుచుకున్న ఇండియా.
