ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ తాజాగా భారత్‌లో బీర్ల అమ్మకాలకు గండికొడుతోందని ఆ కంపెనీ వాపోతోంది. భారత్‌లో ఇప్పటివరకు ఈ వైరస్ బారిన పడిన కేసులు నమోదు కానప్పటికీ.. ఈ వైరస్ వ్యాపించిందేమోనని ప్రజల్లో భయం నెలకొంది. దీని గురించి రకరకాల వదంతులు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. దీంతో జనాలు భయాందోళనలకు గురి అవుతున్నారు. దీని ప్రభావంతో తాజాగా భారత్‌లో కరోనా బ్రాండ్ పేరుతో ఉన్న బీరు అమ్మకాలపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతోంది. ఈ బీరు తాగితే వైరస్ సోకుతుందా అంటూ భారత్‌లో బీరు ప్రియుల్లో అనుమానాలు తలెత్తుతున్నాయి. దీంతో ఆ బ్రాండ్ ను కొనుగోలు చేయటానికి వెనకంజవేస్తున్నారు. దీనిపై తమ అనుమానాలను నివృత్తి చేసుకోవడానికి గుగూల్ ను ఆశ్రయిస్తున్నారు. కరోనా వైరస్, కరోనా బీరుతో సోకుతుందా అని టైప్ చేస్తూ వెబ్ సైట్లో వెతుకుతున్నారు. ఈ ప్రశ్నలను సందిస్తున్న వారిలో ముఖ్యంగా భారత్‌లోని కరోనా బ్రాండ్ బీరు ప్రియులతోపాటు, ఆస్ట్రేలియా, కెనడా, అమెరికా ప్రజలు కూడా ఉంటున్నారు.
Tags Corona Virus Drinking Beer Shock News
Related Articles
ముఖ్యమంత్రి కేజ్రీవాల్ సంచలన ఆరోపణలు
November 19, 2023