మహిళా ప్రపంచ క్రికెట్‌లో అద్భుతంగా రాణించి అందరి దృష్టిని ఆకర్షించిన లేడీ క్రికెటర్ మిథాలీ రాజ్. తెలుగమ్మాయి అయిన మిథాలీ క్రికెట్‌లో అత్యధిక పరుగులు సాధించిన క్రికెటర్‌గా రికార్డ్ సాధించింది. భారత్ క్రికెట్‌కి ఎనలేని సేవలందించిన ఆమె జీవిత నేపథ్యంలో బయోపిక్ రూపొందుతున్న సంగతి తెలిసిందే. వయాకామ్ 18 నిర్మాణంలో రూపొందుతున్న ఈ చిత్రంలో మిథాలీ పాత్రలో తాప్సీ నటిస్తుంది. రాయీస్ ఫేమ్ రాహుల్ దొలాఖియా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. శభాష్ మిథు అనే టైటిల్‌తో రూపొందుతున్న ఈ చిత్ర ఫస్ట్ లుక్ కొద్ది సేపటి క్రితం విడుదలైంది. ఇందులో తాప్సీ .. మిథాలీ పాత్రలో ఒదిగిపోయింది. స్టైలిష్ షాట్ కొడుతున్నట్టుగా కనిపిస్తుంది. 2021 మేలో చిత్రాన్ని విడుదల చేయనున్నట్టు పోస్టర్ ద్వారా పేర్కొన్నారు.
