గత నెలరోజుగా మూడు రాజధానులకు వ్యతిరేకంగా చంద్రబాబు చేసిన డ్రామాలన్నీ శాసనమండలి రద్దుతో అట్టర్ ఫ్లాప్ అయ్యాయి. అబ్బబ్బా..ఏమన్నా డ్రామాలా.. ఇంద్ర సిన్మాలో చిరు లెవెల్లో అమరావతి నేలకు వంగి ముద్దాడడం దగ్గర నుంచి రండమ్మ రండి…ఆయమ్మ అమరావతికి ఓ ఉంగరం ఇచ్చింది..ఈ అక్క కాళ్ల పట్టాలిచ్చింది…అంటూ చదివింపుల పూజారి అవతారం నుంచి…బిచ్చగాడి గెటప్ వరకూ బాబుగారు రాజధాని పేరుతో పండించిన సెంటిమెంట్ అంతా ఇంతా కాదు…ఆఖరకు రాజధాని రైతులతో పాటు తన భార్య, కోడలిని కూడా పండుగ రోజు పస్తులుంచి మరీ రాజధాని రాజకీయాన్ని రక్తికట్టించాడు. గతంలో ఏనాడు శాసనమండలిలో అడుగుపెట్టని చంద్రబాబు ఏకంగా గ్యాలరీలో కూర్చుని స్పీకర్ షరీఫ్‌పై వత్తిడి తెచ్చి…నిబంధనలకు వ్యతిరేకంగా వికేంద్రీకరణ బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపేలా చేసిన కుట్ర బెడిసికొట్టింది..ప్రభుత్వం ఏకంగా శాసనమండలిని రద్దు చేసి చంద్రబాబు ఎత్తులను చిత్తుచేసింది. దీంతో బిక్కచచ్చిన చంద్రబాబు ఇక అమరావతిలో తిరగడం మానేసి…శాసనమండలి రద్దును అడ్డుకునేందుకు ఢిల్లీ వేదికగా రాజకీయం మొదలుపెట్టనున్నారు.
తాజాగా వికేంద్రీకరణ బిల్లుపై, శాపనమండలి రద్దుపై పార్లమెంట్‌లో ఎలా వ్యవహరించాలనే విషయంపై ఎంపీలకు చంద్రబాబు క్లాసులు తీసుకుంటున్నాడు..శాసనమండలి రద్దు అనేది రాష్ట్ర ప్రభుత్వం పరిధిలోని అంశం కాబట్టి….కేంద్రం ఆమోదించడం లాంఛనప్రాయమే..అయితే చంద్రబాబు మాత్రం మండలి రద్దును అడ్డుకోవడానికి ఢిల్లీ వేదికగా కుట్రలు స్టార్ట్ చేశాడు. చంద్రబాబు ఢిల్లీ పాలిటిక్స్‌పై మంత్రి కన్నబాబు ఫైర్ అయ్యారు. బినామీ భూములు కాపాడుకోవడం కోసమే చంద్రబాబు అమరావతి ప్రాంతంలో కృత్రిమ ఉద్యమం నడిపించారని మంత్రి కన్నబాబు ఫైర్ అయ్యారు. ఈ డ్రామాను ఆంధ్రప్రదేశ్ నుంచి ఢిల్లీకి మార్చాలని టీడీపీ ఎంపీలకు బాబు దిశానిర్దేశం చేయడం సిగ్గు చేటని అన్నారు…. చేసిందంతా చేసి మళ్లీ ఢిల్లీలో డ్రామాలు ఆడాలని మీ ఎంపీలకు హితభోద చేస్తారా…. ఢిల్లీలో కాదు..ఎక్కడ డ్రామాలు చేసినా ప్రజలు మిమ్మల్ని ఛీకొట్టడం ఖాయమని చంద్రబాబును కన్నబాబు కడిగిపారేశారు. చంద్రబాబూ..నీ డ్రామాలు, కుట్రలు ఇక చాలని, ప్రజలు నవ్వుకుంటున్నారని మంత్రి ఎద్దేవా చేశారు ప్రశాంతంగా ఉన్న రాష్ట్రంలో ఏదో జరిగిపోతుందని ప్రచారం చేస్తున్నారని మంత్రి మండిపడ్డారు. ఇప్పటికైనా 40 ఏళ్ల అనుభవం అని చెప్పుకుంటున్న చంద్రబాబు హుందాగా ప్రవర్తించాలని మంత్రి కన్నబాబు హితవు పలికారు. మొత్తంగా అమరావతి డ్రామా ముగిసింది..ఢిల్లీలో స్టార్ట్ అయింది…మీకు అర్థమవుతుందా చంద్రబాబు రాజకీయం.