ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నపుడు ప్రతియేట ఏపీ ప్రభుత్వం ఉత్తమ చిత్రంతో పాటు ఉత్తమ నటీనటులకు నంది పురస్కారాలు ఇవ్వడం ఆనవాయితీగా వస్తోంది. ఇక కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నపుడు 2011లో చివరిసారిగా ఏపీ ప్రభుత్వం అవార్డులను ప్రకటించి పురస్కారాలను అందజేసింది. తరువాత వచ్చిన టీడీపీ పార్టీ నంది అవార్డుల పురస్కార ప్రధాన కార్యక్రమాన్ని వాయిదా వేసారు.తాజాగా 2019 ఎన్నికల్లో వై.యస్.జగన్ నేతృత్వంలోని వైసీపీ అధికారంలోకి వచ్చింది. ఇటీవలే మెగాస్టార్ చిరంజీవి సీఎం జగన్ తో భేటీ అయినప్పడు ఇదే విషయం చర్చించినట్లు చిరు తెలిపారు. ఇకపోతే మరోసారి ఫిబ్రవరి 6 న సీయం వైయస్ సీఎం జగన్ తో నంది అవార్డుల ప్రకటన గురించి మెగాస్టార్ చిరంజీవి భేటీ అవుతున్నట్లు సమచారం. దీంతో త్వరలో వైయస్ జగన్ చేతుల మీదుగా నంది అవార్డ్స్ బహుకరణ జరగబోతుంది అన్నమాట