వికేంద్రీకరణ బిల్లును శాసనమండలిలో అడ్డుకోవాలన్న చంద్రబాబు కుటిల రాజకీయం లోకేష్‌తో సహా 29 మంది టీడీపీ ఎమ్మెల్సీల పదవులకే ఎసరు తెచ్చింది. తాజాగా ఏపీ శాసనమండలిని జగన్ సర్కార్ రద్దు చేస్తూ అసెంబ్లీలో తీర్మానాన్ని ఆమోదించింది. మండలి రద్దు బిల్లును కేంద్రానికి పంపించింది. తాజాగా పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఏపీ శాసనమండలి రద్దును కేంద్ర ప్రభుత్వం ఉభయసభలో ఆమోదిసే మరుక్షణం ఎమ్మెల్సీల పదవులన్నీ గల్లంతు అవడం ఖాయం. అయితే శాసనమండలి రద్దు అనేది రాష్ట్ర ప్రభుత్వం పరిధిలోని అంశం కాబట్టి కేంద్రం ఆమోదించేందుకు పెద్దగా అభ్యంతరం చెప్పదు..కాకపోతే రాజకీయ కారణాలు పరిగణనలోకి తీసుకుంటే మాత్రం ఏడాది, రెండేళ్ల పాటు పెండింగ్‌లో పెట్టగలదు. కేంద్రం దగ్గర ఉన్న ఆప్షన్ ఇదొక్కటే..ఇదే చంద్రబాబుకు ధీమాను ఇస్తుంది..తన కొడుకు లోకేష్ పదవి పోకుండా శాసనమండలి రద్దును కేంద్రం ఆమోదించకుండా ఢిల్లీలో ప్రయత్నాలు ఆరంభించాడు. ఈ మేరకు ఎంపీలకు దిశానిర్దేశం చేశాడు. అలాగే పవన్ కల్యాణ్‌తో బీజేపీ పెద్దలతో మాట్లాడించేందుకు ప్రయత్నిస్తున్నాడు.
అయితే కేంద్రం రాజకీయ కారణాలతో శాసనమండలి రద్దును ఆమోదించకుండా పెండింగ్‌లో ఎక్కువ కాలం ఉంచలేదు. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సంబంధాల నేపథ్యంలో తక్షణమే శాసనమండలి రద్దుకు ఓకే చెప్పచ్చు..ఇదే తెలుగు తమ్ముళ్లను ముఖ్యంగా టీడీపీ ఎమ్మెల్సీలను పట్టిపీడిస్తుంది. వికేంద్రీకరణ బిల్లును మండలిలో 3 నెలల కంటే ఎక్కువగా అడ్డుకోలేమని తెలిసి కూడా చంద్రబాబు అత్యుత్సాహానికి పోయి తమ పదవులు పోవడానికి కారణమయ్యాడని టీడీపీ ఎమ్మెల్సీలు లబోదిబమంటున్నారు. శాసనమండలిలో టీడీపీ ఎమ్మెల్సీలే ఎక్కువ. మండలి రద్దుతో లోకేష్‌తో సహా మొత్తం 28 మంది టీడీపీ ఎమ్మెల్సీల పదవులు గల్లంతు కానున్నాయి. దీంతో అసలే అధికారంలో లేము..కనీసం ఎమ్మెల్సీ హోదా ఉంటే..అదీ పోతుంది…ఒక్క దెబ్బతో అందరం రాజకీయ నిరుద్యోగులం అయిపోయాం..దీనికి అంతటికి కారణం చంద్రబాబ స్వార్థమే..అని టీడీపీ ఎమ్మెల్సీలు లోలోపల రగిలిపోతున్నారు. ఇక అందరికంటే ఎక్కువగా లోకేష్ రాజకీయ భవిష్యత్తు గురించి తెలుగు తమ్ముళ్లు చర్చించుకుంటున్నారంట…ఎలాగూ మంగళగిరిలో ఓడిపోయాడు…ఈ ఐదేళ్లు చినబాబు ఎమ్మెల్సీ హోదాతో అయినా రాజకీయం చేసేవాడు..ఇప్పుడు పెదబాబు అదీ లేకుండా చేశాడు..ఇక ఏ హోదాతో రాజకీయం వెలగబెడతాడు..ఇంకా ఆయన్ని ఎవరు లెక్క చేస్తారంటూ…తమ్ముళ్లు తమలో తాము గుసగుసలాడుకుంటున్నారు. మొత్తానికి పాయే..జగన్ దెబ్బకు ఉన్న ఎమ్మెల్సీ పదవి కూడా పోయే..చినబాబు రాజకీయ భవిష్యత్తు ఏంటో చెప్మా అంటూ టీడీపీ ఎమ్మెల్సీలు తెగ చర్చించుకుంటున్నారంట.