న్యూజిలాండ్ వేదికగా జరుగుతున్న ఐదు టీ20 మ్యాచ్ లలో భాగంగా నేడు హామిల్టన్ లో మూడో టీ20 ఆడనున్నారు. మొదటి రెండు మ్యాచ్ లలో ఇండియా గెలిచింది. ఇక ఈ మ్యాచ్ కూడా గెలిస్తే హ్యాట్రిక్ విజయాలే కాకుండా సిరీస్ కూడా కైవశం చేసుకుంటుంది. అయితే టాస్ గెలిచి న్యూజిలాండ్ ఫీల్డింగ్ తీసుకుంది. ఈ సిరీస్ లో మొదటిసారి భారత్ బ్యాట్టింగ్ ఫస్ట్ ఆడుతుంది. మరి విజయం ఎవరిని వరిస్తుందో వేచి చూడాల్సిందే. అందరి చూపు రోహిత్ పైనే ఉంది.