ఏపీ ముఖ్యమంత్రి,అధికార వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు శుభవార్తను తెలియజేయనున్నారు.
ఈ క్రమంలో జనవరి ఒకటో తారీఖునే ప్రభుత్వ ఉద్యోగాల నియామక క్యాలెండర్ ను విడుదల చేస్తామని గతంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి ప్రకటించిన సంగతి తెల్సిందే.
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పలు ప్రభుత్వ శాఖాల్లో ఖాళీల వివరాల నివేదిక రావడంలో ఆలస్యం కావడంతో క్యాలెండర్ ను విడుదల చేయలేదు.
అయితే ఈ నెల ముప్పై ఒకటో తారీఖున ఖాళీల వివరాలపై ముఖ్యమంత్రి జగన్ సమావేశం నిర్వహించనున్నారు. ఈ భేటీలో ఖాళీల భర్తీకి ముఖ్యమంత్రి జగన్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వగానే వారంరోజుల్లో ఉద్యోగ క్యాలెండర్ ను ఏపీపీఎస్సీ విడుదల చేయనున్నది.