అధికారదాహంతో పిల్లనిచ్చిన సొంత మామ, టీడీపీ వ్యవస్థాపకులు, స్వర్గీయ ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి సీఎం కుర్చీ లాక్కుని ఆయన మరణానికి కారకుడయ్యాడు చంద్రబాబు. వైస్రాయ్ హోటల్ దగ్గర ఎన్టీఆర్‌పై చెప్పులు వేయించి అవమానించిన సీన్‌ను తెలుగు ప్రజలు ఎప్పటికీ మర్చిపోలేరు..ఎన్టీఆర్ మరణం తర్వాత పార్టీని పూర్తిగా తన కంట్రోల్‌లో పెట్టుకున్న చంద్రబాబు క్రమంగా నందమూరి కుటుంబసభ్యులను పక్కన పెట్టడం ఆరంభించారు. ఎన్టీఆర్ పెద్దకుమారుడు హరికృష్ణను అవమానించి పార్టీ నుంచి దూరం చేశారు. ఇక మేనరికాలు మంచివి కాదని చెబుతూనే తన కొడుకు లోకేష్‌కు బ్రాహ్మణినిచ్చి పెళ్లి చేసి బాలయ్య చేతులు కట్టేశారు.
అలాగే లోకేష్ సీఎం కాకుండా ఎక్కడ అడ్డువస్తాడో అని జూనియర్ ఎన్టీఆర్‌ను కూడా పక్కనపెట్టారు. ఏదో ఎన్నికల సమయంలో ఓట్ల కోసం ఎన్టీఆర్ పేరు జపం చేస్తాడే తప్ప…అసలు ఎన్టీఆర్ అంటే చంద్రబాబుకు ఉన్న ద్వేషం అంతా ఇంతా కాదు.. 2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు బయటపడిన ఏబీఎన్ ఇంటర్వ్యూ వీడియోటేపులో వాడి పనైపోయిందంటూ… చంద్రబాబు ఎన్టీఆర్‌పై నోరుపారేసుకున్న తీరు చూసి రాష్ట్ర ప్రజలు షాక్ అయ్యారు. పార్టీ వ్యవస్థాపకులు, సొంత మామగారిని వెన్నుపోటు పొడిచి సీఎం కుర్చీని, పార్టీని లాక్కుంది కాక..ఆయన మరణం తర్వాత కూడా వాడు, వీడు అంటూ తిట్టడం చంద్రబాబుకే చెల్లింది.
తాజాగా ఎన్టీఆర్‌ను చంద్రబాబు మరోసారి ఘోరంగా అవమానిస్తున్నారు. ఎన్టీఆర్ తొలిసారి అధికారంలోకి వచ్చిన తర్వాత శాసనమండలిని రద్దు చేశారు. అప్పుడు కేంద్రంలోని రాజీవ్‌గాంధీ ప్రభుత్వం శాసనమండలి రద్దును ఆమోదించింది. అయితే ఆ తర్వాత అధికారం చేపట్టిన చంద్రబాబు మాత్రం శాసనమండలిని పునరుద్ధరించలేదు. 2004లో అధికారంలోకి వచ్చిన వైయస్ శాసనమండలిని పునరుద్ధరిస్తే ఇదే చంద్రబాబు అసెంబ్లీ వేదికగా తీవ్రంగా వ్యతిరేకించారు. వైయస్ తన అనుచరులకు పదవులు కట్టబెట్టడం కోసమే శాసనమండలిని తిరిగి పునరుద్ధరిస్తున్నారని..పెద్దల సభ వల్ల సమయం, ప్రజాధనం వేస్ట్ తప్పా..పెద్దగా ఒరిగేదేం లేదని చంద్రబాబు వాదించారు..
అయితే అదే శాసనమండలి ద్వారా చంద్రబాబు తన కొడుకు లోకేష్‌కు దొడ్డిదారిన 5 శాఖలతో కూడిన మంత్రిపదవిని కట్టబెట్టారు. .ఇప్పుడు వైయస్‌ఆర్ తనయుడు జగన్ చంద్రబాబు కుటిల రాజకీయాలు భరించలేక శాసనమండలిని రద్దు చేశారు. దీంతో పెద్దల సభను రద్దు చేసే అధికారం మీకెవడిచ్చాడంటూ చంద్రబాబు నోరు పారేసుకుంటున్నారు. వైసీపీ నేతలు మాత్రం మీ టీడీపీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్ గారే శాసనమండలిని రద్దు చేశారు..మీరు చూపిన బాటలోనే మేము వెళుతున్నామని కౌంటర్ ఇస్తున్నారు. అయినా చంద్రబాబుతో సహా, టీడీపీ నేతలంతా మండలి రద్దు సరికాదంటూ గగ్గోలు పెడుతున్నారు. తద్వారా తమ పార్టీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్ తీసుకున్న నిర్ణయం తప్పు అని చెప్పకనే చెబుతున్నారు. మొత్తంగా శాసనమండలిలో ఎమ్మెల్సీ పదవులు కాపాడుకునేందుకు చంద్రబాబు, టీడీపీ నేతలు మరోసారి ఎన్టీఆర్‌ను ఘోరంగా అవమానిస్తున్నారు.